సెప్టెంబర్ 21 నుంచి కేయూ డిగ్రీ పరీక్షలు

21 నుంచి కేయూ డిగ్రీ పరీక్షలు
కేయూ:కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఆఖరు సంవత్సరం విద్యార్థులకు ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్‌.మహేందర్‌రెడ్డి,అదనపు అధికారులు డా.పి.సదానందం, డా.వై.వెంకయ్య ఆదివారం తెలిపారు.గతంలో ఆరో సెమిస్టర్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు కూడా హాజరుకావచ్చన్నారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు సెల్ఫ్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.పరీక్ష వ్యవధి రెండు గంటలు మాత్రమేనన్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరుగుతాయని వివరించారు.


Comments

Popular posts from this blog

SFI KAKATIYA UNIVERSITY

The armed peasant struggle in Telangana is an ideal for today's youth

The focal point for social consciousness