SFI KAKATIYA UNIVERSITY
ప్రజాతంత్ర ఉద్యమ వేదిక వరంగల్ అర్బన్ తలపెట్టిన ఫేస్ బుక్ ఆన్ లైన్ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ...
కామ్రేడ్స్,
యూనివర్సిటీ విద్యార్థి మిత్రులారా....
కరోనా కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాగ్ధానాలు,వాటి వైఫల్యాలను నిరసిస్తూ ఆగస్టు 16 వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రజాతంత్ర ఉద్యమ వేదిక,వరంగల్ అర్బన్ ఫేస్ బుక్ పేజీ ద్వారా నిర్వహించబడుతున్న ఆన్ లైన్ బహిరంగ సభను జయప్రదం చేయండి.మహమ్మారి కరోనా కాలంలో అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు, రాష్ట్రంలో వివిధ రంగాల కార్మికులు,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తుతూ తలపెట్టిన ఫేస్ బుక్ ఆన్ లైన్ బహిరంగ సభను విజయవంతం చేయగలరు.ఈ బహిరంగ సభలో రాష్ట్ర నాయకులు ఎం.సాయిబాబా గారు,వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి గారు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు రత్నమాల గారు,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.ప్రభాకర్ రెడ్డిగారు,ఎం.చుక్కయ్య గారు,టి.ఉప్పలయ్య గారు,రావుల రమేష్ గారు పాల్గొంటారు.
ఎక్కువ మందికి బహిరంగసభ చేరవేసేందుకు తప్పనిసరిగా షేర్,లైక్ చేయగలరు.
కింద ఇవ్వబడిన పేజి లింక్ క్లిక్ చేసి సభకు హాజరు కాగలరు
https://www.facebook.com/CPIM-Warangal-839006516124124/
విప్లవాభినందనాలతో
యూనివర్సిటీ అధ్యక్షుడు.
బుర్రి ప్రసన్న కుమార్
యూనివర్సిటీ కార్యదర్శి
బుర్ర వీరభద్రం.
Comments
Post a Comment